తమ గుండె ముక్కపై
ఎంబసీ ముద్రతో గూటిని విడిచి
అందలమెక్కిన తనయుల అడుగుల
క్రిందన నలిగిన తండ్రుల చేతులు అవిగో
ప్రగతి పధంలో ఈజీ పాసులో
ఝామ్మని ఎగిరే లెక్ససు వెనకన
బురదతొ నిండీ ప్రేమతొ తడిసిన
తండ్రుల ఆర్తి నిండిన గాధలు అవిగో
ఏడు జలధుల ఆవల నుండి వాట్సప్
అంటూ ఎప్పటికీ ఆర్తిగ మ్రోగని
ఆ ఫోనుల కోసం ఆత్రంగా పడిగాపులు కాసి
ఎండిన కన్నుల్లో నిండిన శుభాకాంక్షలవిగో
-- మా అబ్బాయిని అప్పుడప్పుడూ ఫొను చెయ్యమన్న
-- ఓ తండ్రి మాటలకు నా స్పందన
tama gunDe mukkapai
embasee mudratO guuTini viDici
andalamekkina tanayula aDugula
krindana naligina tanDrula cEtulu avigO
pragati padhamlO eejee paasulO
jhaammani egirE leksasu venakana
buradato ninDii prEmato taDisina
tanDrula aarti ninDina gaadhalu avigO
EDu jaladhula aavala nunDi vaaTsap
anTuu eppaTikee aartiga mrOgani
aa phOnula kOsam aatramgaa paDigaapulu kaasi
enDina kannullO ninDina SubhaakaankshalavigO
నిజంగా ఈ కవిత మనసుని స్పృశించక మానదు. నాన్న మీద ఇది మీ రెండో కవిత అనుకుంటా ఈ బ్లాగులో. నాకు మా నాన్న గుర్తు వచ్చారు. ఎండిన కన్నుల్లో నిండిన శుభాకాంక్షలవిగో అని తెలిపిన వైనానికి నా కన్నుల్లో చేరింది తడి.
ReplyDeleteno words sir.i know the pain.heart touching one.
ReplyDeleteఎప్పటికీ ఆర్తిగ మ్రోగని
ReplyDeleteఆ ఫోనుల కోసం ఆత్రంగా పడిగాపులు కాసి
ఎండిన కన్నుల్లో నిండిన శుభాకాంక్షలవిగో
చదువిన తరువాత నాకు తెలియకుండానే ఒక దీర్ఘమైన నిట్టూర్పు......
చాలా అర్తితో చెప్పినట్టుంది మీ కవిత
ఎండిన కన్నుల్లో నిండిన శుభాకాంక్షలవిగో
ReplyDeletesuperb image
చక్కటి కవిత! ఆర్ద్రత లొ తడిపి ఆరేసినట్టుంది
ReplyDeleteవంశీ గారు ధన్యవాదాలు.
ReplyDeleteరాధిక గారు మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు.
లలిత గారు బాబా గారు.. ఆ నిట్టూర్పే పదాలుగా మారింది. ధన్యవాదాలు.
జయచంద్ర గారు నా బ్లాగుకు స్వాగతం. నెనరులు.