Friday, October 10, 2008

ఏదేమైనా హాయిగా ?


దారం తెగిన ముత్యాల్లా..
..భావాలు దొర్లేవి
భారం పెరిగిన మబ్బుల్లా..
..కవితలు జారేవి
రాగం తెలిసిన తంత్రుల్లా..
..గీతాలు పాడేవి
గమ్యం ఎరిగిన దిశల్లా..
..దారులు సాగేవి

ఈ రోజెందుకో ఏ అలజడీ లేదు
అంతా ఖళీగా వుంది

ప్రేమను చూసిన భాషలా..
.. కవితలు రగిలేవి
అమ్మని చేరిన బిడ్డలా..
..ఆత్మలు పొంగేవి
అమ్మును వీడిన శరంలా..
..హృదయాలు తాకేవి
ఉదయం తెచ్చిన వరంలా..
..వెలుగులు కమ్మేవి

ఈ రోజెందుకో ఏ అలజడీ లేదు
అంతా ఖళీగా వుంది

అలలు తెలియని లోతు సంద్రంలా ..
మబ్బులెతికే పండు వెన్నెల్లా..
ఆకలెరుగని నిండు విస్తరిలా..
అలిసి ఆగిన బ్రతుకు పందెంలా..

ఈ రోజెందుకో ఏ అలజడీ లేదు
అంతా ఖళీగా వుంది
...
...
ఏదేమైనా హాయిగా !
అవునా?!! నిజంగా ?

daaram tegina mutyaallaa..
..bhaavaalu dorlEvi
bhaaram perigina mabbullaa..
..kavitalu jaarEvi
raagam telisina tantrullaa..
..geetaalu paaDEvi
gamyam erigina diSallaa..
..daarulu saagEvi

ee rOjendukO E alajaDee lEdu
antaa khaLeegaa vundi

prEmanu cuusina bhaashalaa..
.. kavitalu ragilEvi
ammani cErina biDDalaa..
..aatmalu pongEvi
ammunu veeDina Saramlaa..
..hRdayaalu taakEvi
udayam teccina varamlaa..
..velugulu kammEvi

ee rOjendukO E alajaDee lEdu
antaa khaLeegaa vundi

alalu teliyani lOtu sandramlaa ..
mabbuletikE panDu vennellaa..
aakalerugani ninDu vistarilaa..
alisi aagina bratuku pandemlaa..

ee rOjendukO E alajaDee lEdu
antaa khaLeegaa vundi
...
...
EdEmainaa haayigaa ?
avunaa? nijamgaa ?

3 comments:

  1. మీ ఆవేదనని, అసంతృప్తిని చాలా నాజూకుగా వ్యక్తం చేశారు. ఎంత సముద్రమైనా అలలు ఉంటేనే అందం. ఎంత వెన్నెలున్నా మబ్బులుంటేనే దాని అందం. విస్తరి నిండుగా వున్నా తను తినలేని నిస్సత్తువని, బ్రతుకు పరుగులో మీ అలుపుని చాలా అందంగా చెప్పారు. మీ నిట్టూర్పుని హాయిగా మాకు తగిలేలా చేశారు. అభినందనలు.

    ReplyDelete
  2. mundu chala happy mood lo raasaranuknaa...kinda comments choosaka telisindi...edo avedana vundi mee gundello ani...nice one again..thanks.

    ReplyDelete