Friday, October 10, 2008

దసరా సంబరాలు


చంటి అడుగుల పరుగుల సందడి
బోసి నవ్వుల పాపల చావిడి
పారాణి పాదాల గజ్జల రవళి
తోరణాల వెలిగిన మా లోగిలి

పసుపు పులిమిన గడపల పవిత్రత
సన్నాయి గీతాలు తెచ్చిన ప్రశాంతత
ధూప దీపాల వచ్చిన సుందరత
దశమి వెలిసెను మాఇంట దేవత

దేవి మంగళాల గళాల సోయగాలు
శేజా హారతి గణగణల నేపధ్యం
పండు తాంబూలాల పలకరింపులు
పట్టుచీరలు కొత్తనగల పరిచయాలు

వంటింట్లో యుద్ధ సరాగలతో
తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో
కలలు పండుతాయన్న ఆకాంక్షలతో
అందరి కష్టాలు తీరుతాయన్న ఆశలతో

అందుకు సాక్షిగా పండిన మానోళ్ళతో
మా ఇంట ముగిశాయి దసరా సంబరాలు

canTi aDugula parugula sandaDi
bOsi navvula paapala caaviDi
paaraaNi paadaala gajjala ravaLi
tOraNaala veligina maa lOgili

pasupu pulimina gaDapala pavitrata
sannaayi geetaalu teccina praSaantata
dhuupa deepaala vaccina sundarata
daSami velisenu maainTa dEvata

dEvi mangaLaala gaLaala sOyagaalu
SEjaa haarati gaNagaNala nEpadhyam
panDu taambuulaala palakarimpulu
paTTuciiralu kottanagala paricayaalu

vanTinTlO yuddha saraagalatO
tRptinondina atidhula trEnpulatO
kalalu panDutaayanna aakaankshalatO
andari kashTaalu teerutaayanna aaSalatO

anduku saakshigaa panDina maanOLLatO
maa inTa mugiSaayi dasaraa sambaraalu

No comments:

Post a Comment