Monday, October 25, 2010

గతోదయం




రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది

విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.

కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు

గతం, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది

అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.

6 comments:

  1. శ్రీ ఆత్రేయగారికి, నమస్కారములు.

    గత కొద్ది నెలలుగా మీ కవితా మాధురిని మాకు అందించుటలేదు. ఎందుకని?

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. గతం, ప్రతి రాత్రీ
    రెప్పలు చీల్చుకుని
    ఉదయిస్తుంది

    chaala bavundi

    ReplyDelete
  3. గతం, ప్రతి రాత్రీ
    రెప్పలు చీల్చుకుని
    ఉదయిస్తుంది

    అవును నిజంగా ఆ వాక్యం నాకు భలే నచ్చింది!

    ReplyDelete
  4. Hallo Mithramaa!!!
    Abba.hh..!! Pranum lechostondi,,mee blog kavithalaki daachina Bhavalaki..photographs saamanyaminavi kaavu..
    I am liking and loving them very much..Manishi Bhavalu mee okka kavithallone anni kanipistunnayee naaku.. chala bavundi..
    Wonderful Job..!!
    Thank you.

    ReplyDelete