చల్లని ఈ పున్నమి రాత్రిన
ఆకాశంలో వెలిసిన తెల్ల జల్లెడ...
ఆవలి ప్రపంచపు సూర్యకాంతిని
వడగట్టి, మెరిసే రాళ్ళను పైనే ఉంచి
తెల్ల పిండిగా నేలపైకి కురిపిస్తుంది ..
తాళరాని తన వేడితనాన్ని
చల్లదనంగా మార్చి తపనతీర జల్లుతుంది..
చూడలేని తన వాడితన్నాని
నీడగా మార్చి నింగి నింపుతుంది ..
ఉడుకులెత్తే తన ఉసురుగాలుల్ని
నిద్దరొచ్చే లాగ చల్లగా ముంచుతుంది ..
పగ్గాలిరిగిన పగటి బ్రతుకుల్ని
పాపలా జేసి నిద్రలోకి దించుతుంది ..
హాయిగా..అమ్మ ఒడిలా..
చెలి ముద్దు తడిలా ..మరుమల్లె జడిలా..
సడి చేయక సాగే తెల్ల జల్లెడ,
మది నుండి మధుర సుధల్ని వంపుతూ..
అనంత దూరలకు.. సాగుతుంది...
బ్యూటిఫుల్
ReplyDeleteధన్యవాదాలు బాబాగారు.
ReplyDeleteహాయిగా..
ReplyDeleteఅమ్మ ఒడిలా..
చెలి ముద్దు తడిలా ..
మరుమల్లె జడిలా..
చామంతిపూల మడిలా ..
కవితామతల్లి గుడిలా ....
మీ బ్లాగు ..