Friday, October 3, 2008

వస్తావని


నింగినై వేచివున్నా విల్లువై వస్తావని
రాత్రినై వేచివున్నా వేకువై వస్తావని
మోడునై వేచివున్నా వసంతమై వస్తావని
అనంతమై వేచివున్నా అంతమై వస్తావని

బీడునై వేచివున్నా తొలకరివై వస్తావని
నావనై వేచివున్నా దిక్కువై వస్తావని
గోరింకనై వేచివున్నా చిలకవై వస్తావని
కోరికై వేచివున్నా వరమై వస్తావని

మానునై వేచివున్నా ప్రాణమై వస్తావని
మబ్బునై వేచివున్నా మెరుపువై వస్తావని
భాషనై వేచివున్నా భావమై వస్తావని
ఆశనై వేచివున్న తృప్తివై వస్తావని

శిలనై వేచివున్నా శిల్పివై వస్తావని
గాలినై వేచివున్నా తావివై వస్తావని
దారినై వేచివున్నా గమ్యమై వస్తావని
దీపమై వేచివున్నా ఆరేలోపు వస్తావని

అది ఆరేలోపు వస్తావని
ఆ దరి వైపు చూస్తున్నా
అది ఆరేలోపు వస్తావని
అంతం నను చేరేలోపు వస్తావని !!


ninginai vEcivunnaa villuvai vastaavani
raatrinai vEcivunnaa vEkuvai vastaavani
mODunai vEcivunnaa vasantamai vastaavani
anantamai vEcivunnaa antamai vastaavani

beeDunai vEcivunnaa tolakarivai vastaavani
naavanai vEcivunnaa dikkuvai vastaavani
gOrinkanai vEcivunnaa cilakavai vastaavani
kOrikai vEcivunnaa varamai vastaavani

maanunai vEcivunnaa praaNamai vastaavani
mabbunai vEcivunnaa merupuvai vastaavani
bhaashanai vEcivunnaa bhaavamai vastaavani
aaSanai vEcivunna tRptivai vastaavani

Silanai vEcivunnaa Silpivai vastaavani
gaalinai vEcivunnaa taavivai vastaavani
daarinai vEcivunnaa gamyamai vastaavani
deepamai vEcivunnaa aarElOpu vastaavani

adi aarElOpu vastaavani
aa dari vaipu cuustunnaa
adi aarElOpu vastaavani
antam nanu cErElOpu vastaavani

3 comments:

  1. mee bhavalaku....hats off cheppali...deepamai vechi vunna..aarelopu vastavani..raakunda ela vuntundi...intha aartigaa adigite...very touching one....

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు ఆత్రేయగారు. నిజంగా చదవగానే వచ్చేసేలా..

    ReplyDelete
  3. మీ వస్తావని నిజంగా వచ్చేలా చేస్తుంది. :) చిన్న సవరింపు. చిలుక గోరింకలు అని మనం వాడతాము కని దాని అర్థము చిలుక అమ్మాయి గోరింక అబ్బాయి అని కాదు. చిలు గోరింకలు రెండు వేరు వేరు జాతులు. ఆడ చిలుక మగ చిలుక ఆడ గోరింక మగ గోరింకల్ని కలిపి చిలుక గోరింకలు అంటారు మన కవులు. అలాగే చివరి నాలుగు లైనులు సవరించినా తీసేసినా కూడా అందం ఇంకా పెరుగుతుంది. ఎక్కువ ఏమన్న చెప్పి ఉంటే క్షమించగోరుతున్నాను.

    ReplyDelete