Monday, September 15, 2008

అపరిచితులు


మనసు గోడపై పచ్చపొడిచిన
నీ పేరు ఎప్పుడు చెరగబోదు
వీడుకోలుతో గుండెకొచ్చిన
గాయమిప్పుడు మాని పోదు
నీ లేత మనసును గుచ్చి వుంటే
నా మాట నిన్ను నొచ్చి వుంటే
కోపమొకింత చూపి ఐనా
బాధ పక్కకు నెట్టు నేస్తం !
తప్పటడుగులు వేశానేమో
నేను తప్పులు చేశానేమో
క్షమను చూపి ఈ ఒక్క సారికి
అపరిచితులుగ మారుదామ?
మంచి ముహూర్తము ఒకటి చూసి
తిరిగి పరిచయం పెంచుదామా?


manasu gODapai paccapoDicina
nee pEru eppuDu ceragabOdu
veeDukOlutO gunDekoccina
gaayamippuDu maani pOdu
nee lEta manasunu gucci vunTE
naa maaTa ninnu nocci vunTE
kOpamokinta cuupi ainaa
baadha pakkaku neTTu nEstam !
tappaTaDugulu vESaanEmO
nEnu tappulu cESaanEmO
kshamanu cuupi ee okka saariki
aparicituluga maarudaama?
manci muhuurtamu okaTi cuusi
tirigi paricayam pencudaamaa?

8 comments:

  1. ఇదే ఇదే KPK గారు నేను అడిగింది. చాల బాగుంది ఈ కవిత. నాకు కావల్సిన situation మరియు దాని మీద ఓ మంచి కవిత రాసారు. మీ నుంచి కోరుకున్నా శైలి కొంత వరకు నాకు దొరికింది. కొన్నాళ్ళుగా ఈ situation నా mind lO ఉంది. కాని రాయలేదు. ఎందుకంటే భయపడ్డాను ఇది ఎలా రాయాలా అని. మీ ఊహకి hatoff. మరొక్క మారు అభినందనలు. :) :)

    ReplyDelete
  2. good thought

    bollOjubaba

    ReplyDelete
  3. చాలా బాగుంది మీ ఊహ. ఇంకొంచెం ఆర్ధ్రత కలిగిస్తే అందరి మనసుల్లో మిగిలిపొయే కవిత అయ్యేది. "చిరు నవ్వుల వరమిస్తావా" ఇది ఎవరు రాసారో తెలియదు గాని అందరి మనసుల్లో మిగిలింది గా అలానే.

    ReplyDelete
  4. 'చిరునవ్వుల వరమిస్తావా' రాసింది జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. 1992లో అనుకుంటా, ఆ పేరుతో ఓ సినిమా కూడా నిర్మాణమయింది (ప్రేమలేఖ సినిమాలో 'చిన్నదానా ఓ చిన్నదానా' లో ఆడిన రాణి ఈ సినిమాలో కధానాయిక). కారణాంతరాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. ఆ పాట మరేదన్నా సినిమాలో వాదుకున్నారేమో తెలీదు.

    ReplyDelete
  5. chaala chaala baagundi..!!

    ReplyDelete
  6. మీ కవితలు చాలా బాగుంటున్నాయి!

    అబ్రకదబ్ర,
    ఈ సినిమా మీకు గుర్తుందా? బయట విడుదల కాలేదనుకుంటాను గానీ టీవీల్లో విడుదలైంది. తేజ టీవీలో వేస్తుంటాడు అప్పుడప్పుడూ!

    ReplyDelete
  7. चलॊ ऎक्‌बार फिर्‌सॆ अज्‌नबी बन्‌जायॆ हम दॊनॊंँ అన్న పాటనుంచి Inspire అయ్యి రాశారా?? गुम्‌राह లో ఈ పాట నాకు చాల ఇష్టం.

    ReplyDelete
  8. అందరికీ ధన్యవాదాలు
    'fallingangle' నేను ఆ పాటకు ప్రతిధ్వనించలేదు. నాకు కలిగిన (అను)భావాన్ని వ్యక్త పరిచాను.

    ReplyDelete