Friday, September 5, 2008

నాకిక ఎవరున్నారు ?


నాతోడుగ నవ్వటానికి
తలను దాచి నేనేడ్వటానికి
నా మాటలు వినడానికి
నాతప్పులు దిద్దడానికి
నా మంచిని పెంచడానికి
నా నవ్వును పంచడానికి
నువ్వు కాక ఎవరున్నారు ?
నా అద్దమని నిన్నన్నానని
నాకిక తోడుగ రానంటు
నీదారిక నీదేనంటే
నాకిక ఎవరున్నారు ?


naatODuga navvaTaaniki
talanu daaci nEnEDvaTaaniki
naa maaTalu vinaDaaniki
naatappulu diddaDaaniki
naa mancini pencaDaaniki
naa navvunu pancaDaaniki
nuvvu kaaka evarunnaaru ?
naa addamani ninnannaanani
naakika tODuga raananTu
needaarika needEnanTE
naakika evarunnaaru ?

2 comments:

  1. mee kavitalanni bavuntaayi. aite naadO chinna kOrika. meeru saili maarchi raaste kuda okasari chudaalani undi. emantaaru?

    ReplyDelete
  2. నాకు ఏశైలీ లేదు
    నాకే కవిత్వమూ రాదు
    మీ కోరికను మన్నించే స్థోమత
    నాకుందనుకోను.
    నాకొచ్చిన భావాన్ని నాకు తెలిసిన విధంగా
    ఏదో, రాసుకుంటాను.
    నారాతలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    మరో శైలి ఏమన్నా మీరు నేర్పిస్తే
    తప్పక ప్రయత్నిస్తాను !!
    కొత్తది నేర్వటంలో తప్పులేదుగా

    ReplyDelete