Friday, September 26, 2008

ఏకాంతం


రాత్రి తలుపుతట్టింది
రోజు ఎంత వెలిగితే నే ?
ఓడి బయటకెల్లింది
ఏకాంతాన్ని కప్పుకుని
నాలోనేనే దూరిపోయాను
ఎప్పట్లాగానే !
నా కళ్ళ ముందే
జ్ఞాపకాల బండి మీద
నా అతీతం నన్నొదిలి
దూరంగా వెళ్ళిపోయింది
నిశ్శబ్దపు నిశీధుల్లోకి
నా స్వరం తప్పిపోయింది
కనురెప్పల సరిహద్దుపైన
కన్నీళ్ళే గెలిచాయి
చెక్కిళ్ళపై విజయ పతాకం
ఎగురుతోంది గర్వంగా
విరిగిన అద్దం ముక్కల్లో
ఆ చీకటి ముసుగులో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నా తలక్రింద కాలం
తడిసి కరిగిపోయింది
నా ఏకాంతం
నన్ను చూస్తుండగా
మళ్ళీ తెల్లారింది
తను మాత్రం నాతోనే వుంది.

raatri taluputaTTindi
rOju enta veligitE nE ?
ODi bayaTakellindi
Ekaantaanni kappukuni
naalOnEnE duuripOyaanu
eppaTlaagaanE !
naa kaLLa mundE
jnaapakaala banDi meeda
naa ateetam nannodili
duurangaa veLLipOyindi
niSSabdapu niSeedhullOki
naa swaram tappipOyindi
kanureppala sarihaddupaina
kanneeLLE gelicaayi
cekkiLLapai vijaya pataakam
egurutOndi garvangaa
virigina addam mukkallO
aa ceekaTi musugulO
nannu nEnu vetukkunTunnaanu
naa talakrinda kaalam
taDisi karigipOyindi
naa Ekaantam
nannu cuustunDagaa
maLLee tellaarindi
tanu maatram naatOnE vundi.

1 comment:

  1. bahusha keets anukunta. ayanadi night meeda raasina oka poem chadivaanu. adi gurtuvachindi.

    ReplyDelete