Sunday, August 31, 2008
చెల్లి కావాలా దాని పిల్ల కావలా ?
చెల్లి కావాలా దాని పిల్ల కావలా ?
నిన్న దేవుడు వేసిన ప్రశ్న అది !
చెమరిన చెల్లేలి చూపుల్లోంచి
లోకం చూడని పాపను చూశా
ఆరు నెలల పసిదాన్నంటూ
తెలియక నీళ్లను తన్నా నంటూ
మారం చేస్తూ గారం పోతూ
ఆటలు ఆడిన పసి కూనకు
అమ్మకు వచ్చిన కష్టం గూర్చి
వైద్యులు చెప్పిన మార్గం గూర్చి
దేవుడు పెట్టిన వేదన గూర్చి
ఆశలు వదిలిన అమ్మను గూర్చి
ఎలా చెప్పను? ఏమని చెప్పను ?
బిడ్డలు దేవుళ్ళంటుంటారే
వాళ్ళకు తెలియని విషయం వుందా ?
చంపకు మామా నన్ను నేడని
చేతులు మోడ్చిన బేబీ చూసి
అలాగె అంటు బాసను చేసి
దాని పైనే భారం వేసి
దేవుని ప్రశ్నను వాడికే ఇచ్చి
అమ్మను ఇంక నొప్పించొద్దని
మామగ దానికి నీతులు చెప్పి
కంటినీటితొ కాళ్ళను కడిగి
మాదేవుడు నీవని ప్రార్ధన చేశా !!
celli kaavaalaa daani pilla kaavalaa ?
ninna dEvuDu vESina praSna adi !
cemarina cellEli cuupullOnci
lOkam cuuDani paapanu cuuSaa
aaru nelala pasidaannamTuu
teliyaka neeLlanu tannaa nanTuu
maaram cEstuu gaaram pOtuu
aaTalu aaDina pasi kuunaku
ammaku vaccina kashTam guurci
vaidyulu ceppina maargam guurci
dEvuDu peTTina vEdana guurci
aaSalu vadilina ammanu guurci
elaa ceppanu? Emani ceppanu ?
biDDalu dEvuLLanTunTaarE
vaaLLaku teliyani vishayam vundaaa ?
campaku maamaa nannu nEDani
cEtulu mODcina bEbee cuusi
alaage anTu baasanu cEsi
daani painE bhaaram vEsi
dEvuni praSnanu vaaDikE icci
ammanu inka noppincoddani
maamaga daaniki neetulu ceppi
kanTineeTito kaaLLanu kaDigi
maadEvuDu neevani praardhana cESaa !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment