Friday, August 22, 2008

కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?




నువ్వొస్తావని ఎంతసేపు చూశాను
కాలం చిత్తరువై అందంగా గోడెక్కింది
నిద్దుర రెప్పల్ని బలంగ లాగుతున్నా
చిన్న ముల్లు అడ్డంపడి కదలనంది
కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?
నువ్వుంటె పరుగిడుతుంది
లేనప్పుడు నడవనంటుంది !!

కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?

nuvvostaavani entasEpu cuuSaanu
kaalam cittaruvai andamgaa gODekkindi
niddura reppalni balanga laagutunnaa
chinna mullu aDDampaDi kadalanandi
kaalaaniki neeku kokkem enduku ?
nuvvunTe parugiDutundi
lEnappuDu naDavananTundi !!
kaalaaniki neeku kokkem enduku ?

4 comments:

  1. నాకు ఎంతో అద్భుతంగా అనిపించిందీ కవిత. సరళమైన పదాలతో చాలా రమ్యంగా ఉంది. కవితలోని భావం మటుకు హత్తుకునేలా ఉంది.

    ReplyDelete
  2. కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?
    ఈ వాక్యాన్ని ఎందుకు వాడారో కాస్త చెప్తార? ఇక్కడ దాని అర్థం కూడ కొంచెం వివరించండి.

    ReplyDelete
  3. తను రానందుకు కోపంవున్నా
    కాలం నడవక బాధగవున్నా
    నీదేతప్పని చెలితొ చెప్పేకన్నా
    కినుకేమని కాలాన్ని అడిగేకన్నా
    గొడవను* కొంచెం తేలిక చేస్తూ
    నాకు తనపై కోపం లేదని ఆశ్వాసిస్తూ
    కొద్దిగ హాస్యం తోడుగచేస్తూ
    వైరం మాటను లోపల దాచి
    ప్రతిగా 'కొక్కెం' పదమును వాడి
    ప్రేమను ఆమెకు వ్యక్తం వేసా

    (తనకి కాలానికి వున్న గొదవను)
    --అర్ధం అయ్యింది అనుకుంటాను

    tanu raananduku kOpamvunnaa
    kaalam naDavaka baadhagavunnaa
    needEtappani celito ceppEkannaa
    kinukEmani kaalaanni aDigEkannaa
    goDavanu* koncem tElika cEstuu
    naaku tanapai kOpam lEdani aaSwaasistuu
    koddiga haasyam tODugacEstuu
    vairam maaTanu lOpala daaci
    pratigaa 'kokkem' padamunu vaaDi
    prEmanu aameku vyaktam vEsaa

    (tanaki kaalaaniki vunna godavanu)
    --ardham ayyindi anukunTaanu

    ReplyDelete
  4. చాలా నిఘూఢమైన అర్ధం ఉంది ఇందులో. చెప్పిన సమాధానం కూడా అర్దవంతంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete