vEdana vEDiki gunDelu manDaga
anudina jeevita naaTaka sthalilO
navvula rangunu mukhamuna pulimi
OTami opputu vangina naaku
cemarina kannulu cappaTlavaga
taDisina cekkili candanamavaga
aSru dhaaralE maalikalavaga
marioka dRSyamu siddhamu kaaga
terala maaTuku tappaka pOyaa!
వేదన వేడికి గుండెలు మండగ
అనుదిన జీవిత నాటక స్థలిలో
నవ్వుల రంగును ముఖమున పులిమి
ఓటమి ఒప్పుతు వంగిన నాకు
చెమరిన కన్నులు చప్పట్లవగ
తడిసిన చెక్కిలి చందనమవగ
అశ్రు ధారలే మాలికలవగ
మరిఒక దృశ్యము సిద్ధము కాగ
తెరల మాటుకు తప్పక పోయా!
రెప్పల చాటున లేచే అలలెన్నో. ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచేలోపు కంటి పరదాలు చెలియకట్టలై అడ్డునిలుస్తుంది. అది దాటిన వేళ చాటుకెళ్ళమని మనసు హెచ్చరిస్తుంది. బుధ్ధి లాక్కుపోతుంది. హాట్సాఫ్ టు యూ కొండూరు గారు.
ReplyDeletewow....nice
ReplyDeletenice ksna garu