నా కవితలు
Showing posts with label
వెన్నెల
.
Show all posts
Showing posts with label
వెన్నెల
.
Show all posts
Tuesday, February 9, 2010
జ్ఞాపకాల గుబాళింపు..
నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..
కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..
అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..
వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..
Thursday, April 9, 2009
పున్నమి రాత్రి
చల్లని ఈ పున్నమి రాత్రిన
ఆకాశంలో వెలిసిన తెల్ల జల్లెడ...
ఆవలి ప్రపంచపు సూర్యకాంతిని
వడగట్టి, మెరిసే రాళ్ళను పైనే ఉంచి
తెల్ల పిండిగా నేలపైకి కురిపిస్తుంది ..
తాళరాని తన వేడితనాన్ని
చల్లదనంగా మార్చి తపనతీర జల్లుతుంది..
చూడలేని తన వాడితన్నాని
నీడగా మార్చి నింగి నింపుతుంది ..
ఉడుకులెత్తే తన ఉసురుగాలుల్ని
నిద్దరొచ్చే లాగ చల్లగా ముంచుతుంది ..
పగ్గాలిరిగిన పగటి బ్రతుకుల్ని
పాపలా జేసి నిద్రలోకి దించుతుంది ..
హాయిగా..అమ్మ ఒడిలా..
చెలి ముద్దు తడిలా ..మరుమల్లె జడిలా..
సడి చేయక సాగే తెల్ల జల్లెడ,
మది నుండి మధుర సుధల్ని వంపుతూ..
అనంత దూరలకు.. సాగుతుంది...
Monday, February 2, 2009
ఆత్మీయత
కంటి గానుగనుండి కలల సారాన్ని ఆస్వాదిస్తూ
సాగే నీడకు నిర్లిప్త ప్రేక్షకుడిగా
బంగారు ఇసుక తిన్నెలకు ఆరాధకుడిగా
అలల దాగుడు మూతలకు ఆటవస్తువై
ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్నాను
నిలవని అడుగు జాడల్లో ఆత్మీయత వెదుక్కుంటున్నాను
kanTi gaanuganunDi kalala saaraanni aasvaadistuu
saagE niiDaku nirlipta prEkshakuDigaa
bangaaru isuka tinnelaku aaraadhakuDigaa
alala daaguDu muutalaku aaTavastuvai
aapyaayata kOsam eduru cuustunnaanu
nilavani aDugu jaaDallO aatmiiyata వేడుక్కున్తున్నాను !!
Sunday, January 18, 2009
కొండ చెట్టు కొమ్మ మీద
కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది
ఘల్లు మన్న గజ్జెలాగ బోసి పాప నవ్వులాగ
రెల్లు గూటి పడవలాగ అలల మీద ఊగి సాగి
గంతులేసి గుండె అలసి వీడి పోకు ఆగమంది !! కొండ..
తావి గాలి తనువు తాకి డొలికల్లో నన్ను ముంచి
కాంతి కన్ను మూయగానే వీడి పోవు నీడలాగ
నాకు ఏమి కానట్టు జారిపోయె ఈడులాగ !! కొండ..
కొండ చెట్టు కొమ్మ మీద తెల్ల పువ్వు పూసింది
తావి జల్లి గాలి మీద దిక్కు లన్ని ఊదింది
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)