Thursday, February 5, 2009

నా నిరీక్షణ -- నీకోసం

వెన్నెల పంచే వాడొస్తాడని, తన చాయలు వెదుకుతు దరికొస్తాడని,
మురుగు గుంటలో మెలికలు తిరిగిన
కలువ పువ్వులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

బీటలు వారిని నోటిని తెరిచీ, మోరని ఎత్తి నింగిని చూస్తూ
సుధలను నింపే మబ్బులకోసం, కంటి నీటినీ గాలికొదిలిన
బీడు భూమిలా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

తాదాత్మ్యత చెంది, తరుణము ఎరగక తలకిందులుగా తపస్సు చేస్తూ
తను ఎప్పటికీ జారనను కునే చూరు మీద చేరిన
వాన చినుకులా ఉంది నా నిరీక్షణ -- నీకోసం

vennela pancE vaaDostaaDani, tana chaayalu vedukutu darikostaaDani,
murugu gunTalO melikalu tirigina
kaluva puvvulaa undi naa niriikshaNa -- niikOsam

biiTalu vaarini nOTini tericii, mOrani etti ningini cuustuu
sudhalanu nimpE mabbulakOsam, kanTi niiTinii gaalikodilina
biiDu bhuumilaa undi naa niriikshaNa -- niikOsam

taadaatmyata cendi, taruNamu eragaka talakindulugaa tapassu cEstuu
tanu eppaTikii jaarananu kunE cuuru miida cErina
vaana cinukulaa undi naa niriikshaNa -- niikOsam

శాంతి కపోతం

ఊసులు చెప్పిన నీ కళ్ళు, నన్ను మరిచాయా ?
మరెందుకు మౌనంగా ఉన్నాయి ?
కోటలు దాటిన మన మాటలు, ఇపుడు బెదిరాయా ?
మరెందుకు ఆ గిరిలోనే ఆగాయి ?
ప్రతి క్షణం రేగిన అలకలు, అవీ అలిగాయా? ఎందుకు?
సద్దుకు పోతూ కనుమరుగయ్యాయి ?
సరసాలు సరాగాలు సాంత్వనలు, సద్దుమణిగాయి ఎందుకు ?
సమాధానాలు వెదకాలనా ?

ఏమో అవిలేక నేను నేను కాదు... నాలో నేను లేను

రణగొణ ధ్వనులు, రక్త పాతాల మధ్య
తను పెట్టే కేకలు తనకే వినపడని
శాంతి కపోతంలా... నా బ్రతుకు !


uusulu ceppina nii kaLLu, nannu maricaayaa ?
marenduku mounamgaa unnaayi ?
kOTalu daaTina mana maaTalu, ipuDu bediraayaa ?
marenduku aa girilOnE aagaayi ?
prati kshaNam rEgina alakalu, avii aligaayaa? enduku?
sadduku pOtuu kanumarugayyaayi ?
sarasaalu saraagaalu saantvanalu, saddumaNigaayi enduku ?
samaadhaanaalu vedakaalanaa ?

EmO avilEka nEnu nEnu kaadu... naalO nEnu lEnu

raNagoNa dhvanulu, rakta paataala madhya
tanu peTTE kEkalu tanakE vinapaDani
Saanti kapOtamlaa... naa bratuku !