పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
బొమ్మలతొ కొల్వులంట ముంగిట్లో ముగ్గులంట
హరిదాసుల పాటలంట గంగిరెద్దు ఆటలంట
పిల్లగాండ్లకు శెలవలంట ఇళ్ళుబాగ అలికిరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
ముగ్గుల్లో గొబ్బెలంట రంగులద్దు పడతులంట
గార్లుబూర్లు చేస్తరంట భోగిపళ్ళు పోస్తరంట
పంట ఇంటి కొస్తదంట సంబరాలు చేస్తరంట
పండగంట చూడమ్మా పెద్ద సందడంట జూడమ్మా
కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు
పండగంటు పేరు పెట్టి తెగ తిందురు మారాజులు
మనకేమో పొట్టనిండ తిన్న దినమే పండగరా
ఆట పాటలంటావా అదిలేని దినమేదిర?
లేనిరోజు పస్తులుంట మరిచినావురా బిడ్డా ?
భోగిమంటలంటావా? చలికాగుదురంటావా ?
కడుపుమంట రగులుతుంటే చలిదాపుకు రాదు గదర
గారె బూరెలంటావా? మారాజులు మెక్కినాంక పాసికూడు తెద్దువులే !!
కొడకా అది మనకుగాదు ఆదారిన నువ్వుబోకు
కంటినీరు తుడువు బిడ్డ నాటకాలు ఆపు బేట
బయట ఉన్న నూకలోని పురుగులూది లోపలెట్టు
మనకొంపకు వచ్చేటి పంటదిరా ముద్దు బిడ్డ
నేలపాలు సేయమాక వీపుమోత మోగిపోద్ది
గంజి నీకు కాసిత్తా గమ్మున కునుకేయి పోయి !!
వాడి కడుపు మంట తెచ్చే
భోగి మంటల వేడి నాకు
వాడి మాటల తీరు తెచ్చే
ఎద్దు గంటల హోరు నాకు
వాడి ఆకలి కేక తెచ్చే
వేడి గారెల త్రేన్పు నాకు
వాది బాధల మూల్గు లిచ్చే
దాసు భజనల గుర్తు నాకు
వాడు చెరిపిన కంటి నీరే
చేదు నిజమై కలము కదిలెను
పండుగన్నది ఒకరి సొత్తుగ
మిగల రాదని నీతి తెలుపగ
తోటి వారికి సంబరాల్లో పాలు పంచుతు చేయి నిస్తే
బక్కచచ్చిన ఎన్నో మనసులూ పండుగలకు ఎదురు చూస్తాయి !!
నేను ఎప్పుడొ రాసిన కవితను తిరిగి కాస్త కొత్తదనాన్ని చేర్చి మళ్ళి సందర్భం వచ్చింది కనక అందిస్తున్నాను
ఆనందాన్ని అందరికీ పంచుదాం అదే నిజమైన పండగ
మీకందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
Monday, January 12, 2009
తెలుగు కందం ఆంగ్లానికద్దితే ?
తెలుగు కందం ఆంగ్లానికద్దితే
అంతే అందం అబ్బుతుందోచ్ !!!
మాన్యులు తప్పులుంటే మన్నించగలరు,
కం:
ఫర్ సింపుల్ హాపీనెస్
బి ఇట్ యువర్స్ ఆర్ అథర్స్ డుగుడ్ ఓన్లీ
థిస్ సింపుల్ ఏక్ట్ విల్
డెఫినెట్‌లీ చేంజి వరల్డ్ ఫర్ గుడ్ స్లోలీ !!
for simple happyness
be it yours or others do good only
this simple act will
definitely change world for good slowly
ఇది ఏ పద్యమో తెలీదు కానీ
ఫ్లోలో వస్తే రాసి సద్దుకుపోయా
కందంబబ్బెను నాకని
అందంగా మాట చెప్ప ఆంగ్లము నైనన్
పొందిగ్గా రాయగల్గితి
చిందుల్నిక వేసినాను నైబర్లు అర్వన్
Subscribe to:
Posts (Atom)