Tuesday, August 11, 2009
గొడుగు
వానలెన్ని చూసిందో
ఎన్ని ఎండల కాగిందో
బలహీన మయిన బొమికలతో
బేలగా చూస్తుంది..
కానీ ఆ ముఖం మీద
రంగు పూలు మాత్రం
పొడుచుకున్న పచ్చలా
శాశ్వతంగా పలుకరిస్తున్నాయి
కరుకు కాలం
ఎన్ని కరిగించలేదు ?
చిరుగాలి కూడా.. ఇప్పుడు
తనని కృంగదీస్తుంది..
కణుపులిరిగిన చేతిలా
వ్రేలాడ దీస్తుంది.
ఈ వానలో.. మట్టి ముద్దగా
మిగిలిన నేను..
తలదాచుకోవాలనే ఈ పరుగు..
తనతల నేను దాచుకోవడానికో.. ?
నా తల తనలో దాచుకోవడానికో.. ?
పారుతున్న కాలమే సాక్షి !!
త్రినాధ్ గారు తన బ్లాగులో రాసిన ribs అన్న కవితను నాకనుగుణంగా మలచి రాసినది. ఆ కవితను ఇక్కడ చూడండి.
http://musingsbytrinath.blogspot.com/2009/07/ribs.html
Subscribe to:
Posts (Atom)