Monday, November 16, 2009

కవిత లెప్పుడవుతాయో


రెప్ప క్రింద
గులాబీ వనంలో
రాలిపడినవీ..

పారుతున్న ఏటి ధారల్లో
ఏరుకున్నవీ..

వీడని మెళుకువ
కీచురాళ్ళతో పాడుకున్నవీ.

నిట్టూర్పుల వేడికి
ఎండుటాకులై దొర్లుతున్నవీ..

ఎన్ని పదాలో ..
ఎటుచూసినా పదాలే..
ఇవి కవిత లెప్పుడవుతాయో !!?

10 comments:

  1. adbhutam.miiru inta lalitamgaa raasi caalaa roajulayipoayindi :)

    ReplyDelete
  2. చాలా బావుంది అనేసి కవిత ఎంత నచ్చిందో కొలమానం చూపించలేను.. అలా అని చెప్పకుండానూ ఉండలేను :(
    Simple and beautiful!

    ReplyDelete
  3. ఆత్రేయ గారు !
    హృదయానికి హత్తుకొనేలా,
    కుసుమ కోమల మనోహరంగా ఉంది.
    అభినందనలు !

    ReplyDelete
  4. అసలు మీ కవితే ఓ అద్భుతం అనుకుంటూంటే ....ఇంత చక్కటి చిత్రాలెక్కడ దొరుకుతాయో మీకు !

    ReplyDelete
  5. అనుభవాల ఇంకు చేసి మీ కలం లోకి ఎక్కించినప్పుడూ..
    మరి ఎప్పుడో అది...
    ఎదురు చూస్తుంటాము..

    ReplyDelete
  6. రాధిక గారు హ్మ్.. నిజమే నండీ అసలు రాసే చాలా రోజులయింది అందులోనూ ఇటువంటిది. మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

    నిషిగంధ గారూ నిజమేనండీ భావవ్యక్తీకరణకు, ఆపైన వచ్చే భావోద్వేగానికీ కొలతలు గానీ పరిమితులుగానీ ఉండవు. ధన్యవాదాలు.

    గురువుగారూ మీరిలా ఆశీర్వచనాలందించడం చాలా ఆనందంగా ఉంది ధన్యోస్మి.

    పరిమళం గారూ.. నాకవితల్లో చాలా మటుకు చిత్రానికి పుట్టినవే.. అందుకనే ఆ అనుబంధం అలా అనిపిస్తుంది. నెనరులు

    బాబాగారూ.. ధన్యవాదాలు.

    భావన గారు మీతో కలిసి నేనూ ఎదురుచూస్తూ ఉంటానండి.

    మిత్రులారా.. సమయాభావంవల్ల మీమీ బ్లాగులకు వచ్చి చూసినా, స్పందించలేక, కనీసం వ్యాఖ్యాయినా పెట్టలేక పోతున్నాను. క్షంతవ్యుడను.

    ReplyDelete
  7. హమ్మయ్య మీ పద సుగంధాలు మనసుని సేదతీరుస్తున్నాయి.

    ReplyDelete
  8. సుజ్జి గారు ధన్యవాదాలు.

    ఉషగారు మనసారా ఆఘ్రాణించారన్న మాట. సంతోషం.

    ReplyDelete