Tuesday, March 3, 2009
హాయి
నింగి వంగి చుంబించినట్టయింది
గుండె ఉప్పొంగి పొర్లినట్టయింది
నిండు పున్నమి శాంతి గుప్పించినట్టయింది
హాయి ఉప్పెనల్లో గుండె ఊగినట్టయింది
ఆర్తి పిలుపుకాలంబన దొరికినట్టయింది
ఆకాశపుటంచులు తాకినట్టయింది
రెక్కలొచ్చి భూమినొదిలి తిరిగినట్టయింది
ఆనందపు పూలు కళ్ళకు పూసినట్టయింది
నిశిరాత్రి రంగులతో నిండినట్టయింది
సంతోష హార్మ్యాలు కట్టినట్టయింది
విషాద చాయల్ని గెలిచినట్టయింది
విహంగమై విజయపతాక మెగిరినట్టయింది
ఆహ్లాద సౌరభాలు వీచినట్టయింది
మనసు ఇరుకు లోగిళ్ళు పగిలినట్టయింది
కష్టాల కడలిక గడిచినట్టయింది
నష్టాల ఆశకుంట పూడినట్టయింది
మొగ్గతొడిగిన మనసు విరిసినట్టయింది
క్షమయె నాముందు నిలిచినట్టయింది
నెచ్చెలి ఈరోజు ననుచూసి నవ్వింది
చచ్చిన ఓమాను చిగురాకు తొడిగింది
Subscribe to:
Post Comments (Atom)
మీ "హాయి "లో వసంతం ముందే వచ్చేసింది గురువుగారూ !నెచ్చెలి నవ్వు చూసిన చెలికాని మనసులో మావి చిగురు తినకనే కోయిల కూసి వుంటుంది కదండీ !
ReplyDeleteచిగురు తొడిగిన మాను
ReplyDeleteమొగ్గలేస్తోంది,
విచ్చుకున్న మొగ్గలన్ని
పరిమళించి
కబురులేవో చెప్పినట్లుంది
కళ్ళముందే
మీ సంతోషం కదలాడినట్లుంది
అద్భుతంగా
పరిమళగారు, శృతిగారు నా మనసులోని మాటను వ్రాసేసారుగా!!! ఇంక ఏమి వ్రాయను హాయిని హాయిగా ఆస్వాదించడం తప్ప!!!
ReplyDeleteభేష్ మీ ఆనందపు వెల్లువ నన్నూ ముంచేస్తోంది. కలంలో ఈ మధ్య సంతసం ఇలా చిరు కవితలుగా చిందులేస్తోదేం ;) మొన్నామధ్యనేమో ఏకాంతం వదిలిపోయింది, ఇపుడేమో నెచ్చెలి నవ్వేసింది. ఇకపై ఏం జరగనుందో. అబ్బా తలచుకుంటే ఓ చిత్రం వచ్చేస్తోంది మదిలోకి. మీరు కవితగా వ్రాసాక అపుడు చెప్తాను - అచ్చంగా నా వూహాచిత్రానికి అతుకుతుందో లేదో, ఈ మధ్యలో పృధ్వి "ఆయ్ అలా బొమ్మలు వేయటం, వాటికి కవితలల్లటం మా ఇరువురి ఒడంబడిక" అంటారేమో? ;)
ReplyDelete:-) ఆత్రేయ గారూ, ఖుషీ ఖుషీనా ...? మరి ఈ ఆనంద సమయంలో మాకు పార్టీ....
ReplyDeleteపిచ్చబ్బాయి గారు.. పార్టీకి నేను రెడీనే. మీబ్లాగుకొస్తా, మీ పోస్టుకొస్తా.. కామెంటు విండోకొస్తా.. ఎక్కడైనా ఎప్పుడైనా.. బ్లాగ్మే స్వాల్.. నే నెలాంటి పార్టీ కైనా రేడీ..(పొలిటికల్ వైతే నేను దూరమండీ క్షమించండి) మరి మీరు రెడీనా ? :-)
ReplyDeleteపరిమళం గారు బాగా చెప్పారు. కోయిల కూసి కూసి అలిసింది. అవధులు దాటిని ఆనందాన్ని గుండెల్లో నింపుకుంది.
శృతి గారు ధన్యవాదాలు.
పద్మార్పిత గారు ఆనందాలు అందరికీ పంచేటందుకే.. ఆస్వాదించండి
ఉష గారు.. అమ్మో మీరేమి ఊహించుకుంటున్నారో ఏమో.. నాకు కాస్త భయంగానే ఉంది.