Tuesday, September 16, 2008

అందని ఫలం !!


బురదలో పుట్టిన పద్మానికి
కొలనులో విరిశిన కలువలకి
కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళకి
మట్టిలో పుట్టిన మాణిక్యానికి
గుడిలో వెలిసిన కొండరాతికి
గుండెలో ఒదిగిన నీకు
పోలికేమిటని చూస్తున్నావా?
వాటివిలువ వాటికి తెలియదు
నీకా విలువ లేదని చెప్పకు
నువ్వు నాకు అమూల్యం అతుల్యం
అస్పృశ్యం అలభ్యం .. అందని ఫలం !!

buradalO puTTina padmaaniki
kolanulO viriSina kaluvalaki
kaLLallO tirigina kanneeLLaki
maTTilO puTTina maaNikyaaniki
guDilO velisina konDaraatiki
gunDelO odigina neeku
pOlikEmiTani cuustunnaavaa?
vaaTiviluva vaaTiki teliyadu
neekaa viluva lEdani ceppaku
nuvvu naaku amuulyam atulyam
aspRSyam alabhyam .. andani phalam !!

మామూలు మనిషి


గుండెలు తోడి వాడి గోళ్ళతో నొక్కినా
మృదువుగా మ్రోగగల వీణను కాను
మనసును తొలిచి వేడి దబ్బనాలు గుచ్చినా
అందంగా పాడగల వేణువు కాను
తోలు వొలిచి కసిగా కాల్చి కట్టినా
పాటకు ప్రాణమిచ్చే తప్పెట కాను
చిన్న విషయాలకు ఆనంద పడుతూ
ఉన్న ప్రేమను బయట పెడుతూ
చేజారిన దాని కోసం బాధ పడుతూ
అందని దానికై ఆరాటపడుతూ
అందిన వాడిపై ఈర్ష్య పడుతూ
బ్రతుకు నడిపే మనిషిని
మామూలు మనిషిని
నేను మామూలు మనిషిని !!


gunDelu tODi vaaDi gOLLatO nokkinaa
mRduvugaa mrOgagala veeNanu kaanu
manasunu tolici vEDi dabbanaalu guccinaa
andangaa paaDagala vENuvu kaanu
tOlu volici kasigaa kaalci kaTTinaa
paaTaku praaNamiccE tappeTa kaanu
cinna vishayaalaku aananda paDutuu
unna prEmanu bayaTa peDutuu
cEjaarina daani kOsam baadha paDutuu
andani daanikai aaraaTapaDutuu
andina vaaDipai eershya paDutuu
bratuku naDipE manishini
maamuulu manishini
nEnu maamuulu manishini !!

ఏ మయ్యింది ?


భాషగ మారిన భావం
వ్యక్తపరిచీ వ్యర్ధమయ్యింది
అరిచి అలసిన మనసు
మిన్నకుంది, మూగదయ్యింది
తలపుల్లో మెరిసిన నాకళ్ళు
కలలు కరిగి శుద్ధమయ్యాయి
పెదవిపై ఉండాల్సిన నా నవ్వు
లోనికి జారింది, గుండె బరువయ్యింది
ఎంత కాలానికో కంట నీరు నిండింది
లోన మంట మొదలయ్యింది !!


bhaashaga maarina bhaavam
vyaktaparicee vyardhamayyindi
arici alasina manasu
minnakundi, muugadayyindi
talapullO merisina naakaLLu
kalalu karigi Suddhamayyaayi
pedavipai unDaalsina naa navvu
lOniki jaarindi, gunDe baruvayyindi
enta kaalaanikO kanTa neeru ninDindi
lOna manTa modalayyindi !!

Monday, September 15, 2008

అంతా నువ్వే


పాప నవ్వుల్లో పచ్చని చేలల్లో
సాగే దారుల్లో గడిచిన గాధల్లో
వీచే గాలుల్లో వీడని తలపుల్లో
చెప్పే మాటల్లో చూసే కన్నుల్లో
వేచిన ఘడియల్లో వేదన కవితల్లో
విరిసిన పూవుల్లో మెరిసిన కళ్ళల్లో
చల్లని జల్లుల్లో తెల్లని వెన్నెల్లో
కదిలిన చేతనలో కడిగిన ముత్యంలో
వెచ్చని గుండెల్లో వచ్చిన కవితల్లో

ఇంతెందుకు అంతా... అంతా... ఈ జగమంతా !!
నిజం చెప్పనా ?
నా పిచ్చి ఊహలకు అంతేలేదు
పిచ్చిదైనా ఎంత బాగుంది ?
అంతా నువ్వే!! కానీ నువ్వెక్కడ ? కనిపించవే ?


paapa navvullO paccani cElallO
saagE daarullO gaDicina gaadhallO
veecE gaalullO veeDani talapullO
ceppE maaTallO cuusE kannullO
vEcina ghaDiyallO vEdana kavitallO
virisina puuvullO merisina kaLLallO
callani jallullO tellani vennellO
kadilina cEtanalO kaDigina mutyamlO
veccani gunDellO vaccina kavitallO
intenduku antaa... antaa... ee jagamantaa !!
nijam ceppanaa ?
naa picci uuhalaku antElEdu
piccidainaa enta baagundi ?
antaa nuvvE!! kaanee nuvvekkaDa ? kanipincavE ?

నేనెవరో మరోసారి తెలుపవా నేస్తం ?


బ్రతుకు బాటలో కలిశావు
గుండెలోతుల్లో ఒదిగావు
మనసుని మధనం చేశావు
ప్రేమను గుర్తుకు తెచ్చావు

కలలను తెచ్చావు
కవితలు రేపావు
మనిషిని చేశావు
మనసుని దోచావు

నాతో స్నేహం చేశానన్నావు
నీకే ప్రేమా లేదన్నావు
మనసుని మార్చే శోధన చేస్తూ
మరుపుని మదిలో ఆహ్వానించా !

నిన్ను మరిచి మన్ననను కున్న
కన్నీళ్ళ సాగరంలో జాత రనుకున్న
కానీ మొన్నటినుంచి నీ గురుతేలేదు
కాలం ఎలా జారిందో తెలియనే లేదు

కానీ ఒక్క పొరపాటు
నే పిలిచిన మరుపు
నన్ను నేను మరిచేలా చేసింది
నేనెవరో మరోసారి తెలుపవా నేస్తం ?

bratuku baaTalO kaliSaavu
gunDelOtullO odigaavu
manasuni madhanam cESaavu
prEmanu gurtuku teccaavu

kalalanu teccaavu
kavitalu rEpaavu
manishini cESaavu
manasuni dOcaavu

naatO snEham cESaanannaavu
neekE prEmaa lEdannaavu
manasuni maarcE SOdhana cEstuu
marupuni madilO aahvaaniMcaa !

ninnu marici mannananu kunna
kanneeLLa saagaramlO jaata ranukunna
kaanee monnaTinunci nee gurutElEdu
kaalam elaa jaarindO teliyanE lEdu

kaanee okka porapaaTu
nE pilicina marupu
nannu nEnu maricElaa cEsindi
nEnevarO marOsaari telupavaa nEstam ?

ఇది బ్రతుకయ్యింది !!


ఇది కల ఐనా బాగుండు
ఉదయాన్నే కరిగి పోయుండేది
ఇది ఊహ ఐనా బాగుండు
నిజమవదని మనసుకు కుదుటపడేది
ఇది కవిత ఐనా బాగుండు
పదాల్లో బందీగ కూర్చుండేది
ఇది కధ ఐనా బాగుండు
చివరి పుటతో సమసిపోయేది
విధి ఎవడికి తెలుసు ?
కనులెదుటే నిజమయ్యింది
చెరపలేని రాతయ్యింది
తీయనైన బాధయ్యింది
గుండె నిండిన ప్రేమయ్యింది
ఇది బ్రతుకయ్యింది !!


idi kala ainaa baagunDu
udayaannE karigi pOyunDEdi
idi uuha ainaa baagunDu
nijamavadani manasuku kuduTapaDEdi
idi kavita ainaa baagunDu
padaallO bandeega kuurcunDEdi
idi kadha ainaa baagunDu
civari puTatO samasipOyEdi
vidhi evaDiki telusu ?
kanuleduTE nijamayyindi
cerapalEni raatayyindi
teeyanaina baadhayyindi
gunDe ninDina prEmayyindi
idi bratukayyindi !!

నీ కలల వాకిళ్ళు


నీ కలల వాకిళ్ళు
నా కళ్ళు
చెక్కిళ్ళపై కళ్ళాపులు
ఆశల రంగ వల్లులు
నవ్వుల హరిగానాలు
కళ్ళు మూసుంటేనే
నా కలల సంక్రాంతి
తెరిస్తే దీపావళే !


nee kalala vaakiLLu
naa kaLLu
cekkiLLapai kaLLaapulu
aaSala ranga vallulu
navvula harigaanaalu
kaLLu muusunTEnE
naa kalala sankraanti
teristE deepaavaLE !

నువ్వెవరు ?


నెట్టినా పోని ఆలోచన
కట్టినా ఆగని తలపులు
గట్టెక్కని జ్ఞాపకాలు
ఉట్టెక్కని ఊహలు
నువ్వెవరు ?
నీకు నేనెవరు ?
పేరొక కమ్మని కావ్యం
స్పర్స ఒక చందన లేపనం
తలపొక సుందర దృశ్యం
మాటొక తీయని గానం
నవ్వొక చల్లని గమ్యం
నా ఊహవు కావుగదా?
నా కవితా సుందరి కావుగదా?
నేనంటే ఎంత మక్కువ !
నాకోసం రూపంతో వచ్చావా !?


neTTinaa pOni aalOcana
kaTTinaa aagani talapulu
gaTTekkani jnaapakaalu
uTTekkani uuhalu
nuvvevaru ?
neeku nEnevaru ?
pEroka kammani kaavyam
sparsa oka candana lEpanam
talapoka sundara dRSyam
maaToka teeyani gaanam
navvoka callani gamyam
naa uuhavu kaavugadaa?
naa kavitaa sundari kaavugadaa?
nEnanTE enta makkuva !
naakOsam ruupamtO vaccaavaa !?

అంతా నువ్వే


విరిసిన పూవుల్లో మెరిసిన కళ్ళల్లో
చల్లని జల్లుల్లో తెల్లని వెన్నెల్లో
కదిలిన చేతనలో కడిగిన ముత్యంలో
వెచ్చని గుండెల్లో వచ్చిన కవితల్లో
అంతా నువ్వే చెలీ అంతా నువ్వే !!

virisina puuvullO merisina kaLLallO
callani jallullO tellani vennellO
kadilina cEtanalO kaDigina mutyamlO
veccani gunDellO vaccina kavitallO
antaa nuvvE celee antaa nuvvE !!

అపరిచితులు


మనసు గోడపై పచ్చపొడిచిన
నీ పేరు ఎప్పుడు చెరగబోదు
వీడుకోలుతో గుండెకొచ్చిన
గాయమిప్పుడు మాని పోదు
నీ లేత మనసును గుచ్చి వుంటే
నా మాట నిన్ను నొచ్చి వుంటే
కోపమొకింత చూపి ఐనా
బాధ పక్కకు నెట్టు నేస్తం !
తప్పటడుగులు వేశానేమో
నేను తప్పులు చేశానేమో
క్షమను చూపి ఈ ఒక్క సారికి
అపరిచితులుగ మారుదామ?
మంచి ముహూర్తము ఒకటి చూసి
తిరిగి పరిచయం పెంచుదామా?


manasu gODapai paccapoDicina
nee pEru eppuDu ceragabOdu
veeDukOlutO gunDekoccina
gaayamippuDu maani pOdu
nee lEta manasunu gucci vunTE
naa maaTa ninnu nocci vunTE
kOpamokinta cuupi ainaa
baadha pakkaku neTTu nEstam !
tappaTaDugulu vESaanEmO
nEnu tappulu cESaanEmO
kshamanu cuupi ee okka saariki
aparicituluga maarudaama?
manci muhuurtamu okaTi cuusi
tirigi paricayam pencudaamaa?

Thursday, September 11, 2008

నా భాగ్యం


నా ఆశలు నీ కళ్ళకు వెలుగును ఇస్తే
నా నిట్టూర్పులు నీపాటకు తాళం ఐతే
నా చేతులు నీబాటకు చెప్పులు ఐతే
నా చూపులు నీ భవితకు దర్పణమైతే
నా మాటలు నీ ఆశకు దీవెన ఐతే
నా బ్రతుకుకు ఇంకో భాగ్యం లేదంటే నిజమె చెలియా !!


naa aaSalu nee kaLLaku velugunu istE
naa niTTuurpulu neepaaTaku taaLam aitE
naa cEtulu neebaaTaku ceppulu aitE
naa cuupulu nee bhavitaku darpaNamaitE
naa maaTalu nee aaSaku deevena aitE
naa bratukuku inkO bhaagyam lEdanTE nijame celiyaa !!

Monday, September 8, 2008

నువ్వు


బిడ్డడేమో నాల్గు పదముల
ఇల్లంతా పారాడుతు
అమ్మకు రొప్పును తెచ్చెను
యుక్త వయసు రాగానే
రెండుంటే చాలునంటు
జగములు తిరిగెను
తాతైతే నడవలేక
ముక్కాలిక తధ్యమంటు
కర్రను బట్టెను
నాకేము బ్రతకటానికి
నువ్వన్నది ఒక్క పదము
చాలును సఖియా !!


biDDaDEmO naalgu padamula
illantaa paaraaDutu
ammaku roppunu teccenu
yukta vayasu raagaanE
renDunTE caalunanTu
jagamulu tirigenu
taataitE naDavalEka
mukkaalika tadhyamanTu
karranu baTTenu
naakEmu bratakaTaaniki
nuvvannadi okka padamu
caalunu sakhiyaa !!

ఎన్నాళ్ళీ మోసపు బ్రతుకు ?


జీవిత రధ చక్రాల
మధ్యన నలిగి
రక్తసిక్తమైన భావ
కుసుమాలను
భాషతొ ప్రాసతొ కడిగి
కవిత దారంతొ అల్లి
మాలను కట్టి
అశృధారల అత్తరు జల్ల్లి
వేదన గీతాల సవిరించిన
స్వరాలు నేపధ్యంలో
ఎవరికా దండ ?
ఆ నవ్వులు పులిమిన
ముఖమెందుకు ?
ఎన్నాళ్ళీ మోసపు బ్రతుకు ?


jeevita radha cakraala
madhyana naligi
raktasiktamaina bhaava
kusumaalanu
bhaashato praasato kaDigi
kavita daaramto alli
maalanu kaTTi
aSRdhaarala attaru jallli
vEdana geetaala savirincina
swaraalu nEpadhyamlO
evarikaa danDa ?
aa navvulu pulimina
mukhamenduku ?
ennaaLLee mOsapu bratuku ?

Friday, September 5, 2008

నాకిక ఎవరున్నారు ?


నాతోడుగ నవ్వటానికి
తలను దాచి నేనేడ్వటానికి
నా మాటలు వినడానికి
నాతప్పులు దిద్దడానికి
నా మంచిని పెంచడానికి
నా నవ్వును పంచడానికి
నువ్వు కాక ఎవరున్నారు ?
నా అద్దమని నిన్నన్నానని
నాకిక తోడుగ రానంటు
నీదారిక నీదేనంటే
నాకిక ఎవరున్నారు ?


naatODuga navvaTaaniki
talanu daaci nEnEDvaTaaniki
naa maaTalu vinaDaaniki
naatappulu diddaDaaniki
naa mancini pencaDaaniki
naa navvunu pancaDaaniki
nuvvu kaaka evarunnaaru ?
naa addamani ninnannaanani
naakika tODuga raananTu
needaarika needEnanTE
naakika evarunnaaru ?

పల్లెటూరు




ప్రెసిడెంటు గారి కూతురు
పురిటికొచ్చిన వార్త
పాల వాడి పెళ్ళాంతొ
తాగి చేసిన రభస
పొరుగూరు పొలాల్లో
మునసబు కూతురు భాగోతం
పట్నంలొ పంతులుగారబ్బై
రుచి చూసిన బిర్యానీ విషయం
పాకా కొట్టు పాపారావు కిళ్ళీలా
మావూళ్ళో తొందరగ పొక్కుతై
చెరువు ఆవలి గట్టున చాకలి శబ్దాలే
మాదాకా రావటానికి సమయం పట్టేది !!


presiDenTu gaari kuuturu
puriTikoccina vaarta
paala vaaDi peLLaamto
taagi cEsina rabhasa
poruguuru polaallO
munasabu kuuturu bhaagOtam
paTnamlo pantulugaarabbai
ruci cuusina biryaanii vishayam
paakaa koTTu paapaaraavu kiLLiilA
maavuuLLO tondaraga pokkutai
ceruvu aavali gaTTuna caakali SabdaalE
maadaakaa raavaTaaniki samayam paTTEdi !!

జ్ఞాపకాలు


మనసు చెరువులో
జ్ఞాపకాల అలలు
దాటిపోవు రాక మానవు

manasu ceruvulO
jnaapakaala alalu
daaTipOvu raaka maanavu

ఆస్తులు


అస్థ వ్యస్థాలోచనల
ఆస్తుల పోగులతో

జ్ఞాపకాల అస్తులపై
కట్టిన ఆశా సౌధాలు

పరిస్థితుల కంపాలకు
ఆస్తులు కూలినా లేకున్నా

మిగిలేవి అస్తికలే
చెదిరేవి ఆశలే !!



astha vyasthaalOcanala
aastula pOgulatO

jnaapakaala astulapai
kaTTina aaSaa soudhaalu

paristhitula kampaalaku
aastulu kuulinaa lEkunnaa

migilEvi astikalE
cedirEvi aaSalE

తీరం


మనసు ముసురులో దీప స్థంభం
విరిగిన చుక్కాని
చిరిగిన తెరచాప
గిరగిర తిరిగే దిక్కుల ముల్లు

గమ్యం తెలిసేదెప్పుడు ?
తీరం చేరేదెప్పుడు ?


manasu musurulO deepa sthambham
virigina cukkaani
cirigina teracaapa
giragira tirigE dikkula mullu

gamyam telisEdeppuDu ?
teeram cErEdeppuDu ?

ఒంటరితనం


నా మౌనానికి బదులు చెప్తూ
ఏకాంతంలో తోడును ఇస్తూ
గుండెచప్పుడికి తాళంవేస్తూ
నేనున్నానని గుర్తు చేస్తూ
నాతో వుంది నా ఒంటరితనం


naa mounaaniki badulu ceptuu
EkaantamlO tODunu istuu
gunDecappuDiki taaLamvEstuu
nEnunnaanani gurtu cEstuu
naatO vundi naa onTaritanam
Edit/Delete Message
Reply With Quote

Wednesday, September 3, 2008

స్వేచ్ఛా జీవి


పక్కన పోయే పట్టాలన్నా
నదికి రెండు తీరాలన్నా
నింగి నేల మనమే అన్నా
మదిలో భావం వ్యక్తం చేశా
ఆశలు లేవని ఏకరువెట్టా
గుండెను పిండె మాటను అన్నావ్‌
బుట్టలో వేసే తత్వం కాదు
బంధాలేశే మనిషిని కాదు
ప్రేమకు స్వార్ధం అన్నదిలేదు
నీవు ఎప్పుడూ స్వేచ్ఛా జీవివి
తప్పని చెప్పు తప్పుకు పోతా
వద్దని చెప్పు మాయం అవుతా



pakkana pOyE paTTaalannaa
nadiki renDu teeraalannaa
ningi nEla manamE annaa
madilO bhaavam vyaktam cESaa
aaSalu lEvani EkaruveTTaa
gunDenu pinDe maaTanu annaav
buTTalO vEsE tatwam kaadu
bandhaalESE manishini kaadu
prEmaku swaardham annadilEdu
neevu eppuDuu swEcchaa jeevivi
tappani ceppu tappuku pOtaa
vaddani ceppu maayam avutaa

గాలిపటం


బంధాల తాటికి చిక్కి
మనసుని ఫణంగ పెట్టి
నింగినెగిరే గాలి పటం
ఎగరేసే వాడికి కాలక్షేపం
దాని కోరికలేవడికి కావాలి ?


bandhaala taaTiki cikki
manasuni phaNamga peTTi
ninginegirE gaali paTam
egarEsE vaaDiki kaalakshEpam
daani kOrikaleavaDiki kaavaali ?

తోడుగా


నానుండి విడివడక
చంద్రునికడ వెన్నెలవలె
దరికొచ్చిన తలపులవలె
నడవగ నా బాటలో
నీడగా నాతోడుగా
వుండవా నా గుండేలో ?

naanunDi viDivaDaka
candrunikaDa vennelavale
darikoccina talapulavale
naDavaga naa baaTalO
neeDagaa naa tODugaa
unDavaa naa gunDelO ?

సూరీడు


కోడి కూత విన్నాక
బద్ధకంగా లేచాడు
చెట్టుమీద తను వాలి
పక్షులన్ని లేపాడు
సుబ్బలక్ష్మి సుప్రభాతం
నచ్చలేదు కాబోలు
ఊరు అంతా నిద్ర లేపి
తిరిగి నింగి కెక్కాడు
చుప్పనాతి సూరీడు
వాడి బుద్ధి చూపాడు !!

kODi kuuta vinnaaka
baddhakangaa lEcaaDu
ceTTumeeda tanu vaali
pakshulanni lEpaaDu
subbalakshmi suprabhaatam
naccalEdu kaabOlu
uuru antaa nidra lEpi
tirigi ningi kekkaaDu
cuppanaati suureeDu
vaaDi buddhi cuupaaDu !!

ఇంకా రావేంటి ?


వారమునుంచి వేచిన రోజు
ఎన్నో యుగాలకి రానే వస్తే

ఈరోజెంతొ అద్భుత దినమని
దారిలొ చెట్టులు రంగులు మారితే

వేచిచూసిన పండుగ నేడని
ముస్తాబయ్యి భానుడు లేస్తే

నిన్ను కలిసే దినము నేడని
మంచు తెరలు మాయములయితే

ఎపుడో వచ్చి ఇక్కడ చేరి
నీకై చూస్తూ జోగుతు ఉన్నా

ఎంతసేపు చూడాలి ?
ఇంకా రావేంటి ?


vaaramununci vEcina rOju
ennO yugaalaki raanE vastE

eerOjento adbhuta dinamani
daarilo ceTTulu rangulu maaritE

vEcicuusina panDuga nEDani
mustaabayyi bhaanuDu lEstE

ninnu kalisE dinamu nEDani
mancu teralu maayamulayitE

epuDO vacci ikkaDa cEri
neekai cuustuu jOgutu unnaa

entasEpu cuuDaali ?
inkaa raavEnTi ?

ఈలు ఈలు !!


పార్కుకు అంటే వస్తానంటావ్*
మాటలు కోటలు దాటించేస్తావ్*
కళ్ళతొ ప్రేమను కురిపించేస్తావ్*
పలుకుతొ మనసుని కరిగించేస్తావ్*

నా మనసులో భావం వ్యక్తంచేస్తే
పెదవిని విరిచి దాటించేస్తావ్*
ఆ తీపి బాధకు బానిసనయ్యి
ఆ స్వార్ధంతోనే మళ్ళీ చెప్తా !

ఈలు ఈలు !!



paarkuku anTE vastaananTaav
maaTalu kOTalu daaTincEstaav
kaLLato prEmanu kuripincEstaav
palukuto manasuni karigincEstaav

naa manasulO bhaavam vyaktamcEstE
pedavini virici daaTincEstaav
aa teepi baadhaku baanisanayyi
aa swaardhamtOnE maLLee ceptaa !

eelu eelu !!

Tuesday, September 2, 2008

కలవని తీరాలు


ఆ రైలు పట్టాలు
నదికున్న తీరాలు
దూరాన నింగి నేల
ఇక నువ్వు నేను
అందరం బంధువులం
ఎప్పుడూ ఉంటాం
ఎన్నడూ కలవం
కానీ తోడుగ ఉంటాం !!


aa railu paTTaalu
nadikunna teeraalu
duuraana ningi nEla
ika nuvvu nEnu
andaram bandhuvulam
eppuDuu unTaam
ennaDuu kalavam
kaanee tODuga unTaam !!

నా కళ్ళల్లోకి చూడు


గుండె గోడపై ప్రేమ కుంచెతో
ఓ చిత్రం గీశా
నా కళ్ళల్లోకి చూడు
కనిపిస్తుంది !!
ఓ చిరునవ్వుల చందన బింబాన్ని
మనసు మైనంతో మలిచుంచేశా
నా కళ్ళల్లోకి చూడు
కనిపిస్తుంది !!

gunDe gODapai prEma kuncetO
O citram geeSaa
naa kaLLallOki cuuDu
kanipistundi !!
O cirunavvula candana bimbaanni
manasu mainamtO malicuncESaa
naa kaLLallOki cuuDu
kanipistundi !!

పసివాడి నవ్వు


బుజ్జిగాడి బొజ్జమీద
నా ముని వేళ్ళ నాట్యం
గతి తప్పక తగ్గట్టుగ
వాడి కిలకిలల నట్టువాంగం
అందమైన బంధాల జుగలబందీ !!


bujjigaaDi bojjameeda
naa muni vELLa naaTyam
gati tappaka taggaTTuga
vaaDi kilakilala naTTuvaangam
andamaina bandhaala jugalabandee !!

ప్రియురాలు ఎంత కఠినం !!


ఫోనేమైనా మ్రోగిందేమో
కాలేమైనా మిస్సైందేమో
ఈమేలైనా వచ్చిందేమో

నీ కై ఎంతో పరితపిస్తూ
ఫలితము లేక నిస్సత్తువగా
గడిపిన నా ఈ నాల్గు రోజులూ...

అదే తపనతో దేవుని కోసం తపస్సు చేస్తే
భక్తా నీ భక్తికి మెచ్చానంటూ
సిరికింజెప్పక ఠక్కున వచ్చి

అడిగిన వరములు ఇచ్చేవాడు
చెప్పిన గోడు వినేవాడు !

ప్రియురాలు ఎంత కఠినం !!

phOnEmainaa mrOgindEmO
kAlEmainaa missaindEmO
eemElainaa vaccindEmO

nee kai entO paritapistuu
phalitamu lEka nissattuvagaa
gaDipina naa ee naalgu rOjuluu...

adE tapanatO dEvuni kOsam tapassu cEstE
bhaktaa nee bhaktiki meccaananTuu
sirikinjeppaka Thakkuna vacci

aDigina varamulu iccEvaaDu
ceppina gODu vinEvaaDu !

priyuraalu enta kaThinam !!

Monday, September 1, 2008

అడుగు


తావిచ్చే పూవును అడుగు
ఒకరోజుకు ఇవ్వొద్దని
వెలుగిచ్చె సూర్యుని అడుగు
ఈ రోజుకు రావొద్దని
మనసిచ్చిన నాకెందుకు చెప్తావ్‌
ఈరోజున పిలవద్దని తలవద్దని ?


taaviccE puuvunu aDugu
okarOjuku ivvoddani
velugicce suuryuni aDugu
ee rOjuku raavoddani
manasiccina naakenduku ceptaav
eerOjuna pilavaddani talavaddani ?

Sunday, August 31, 2008

what a sight!!


nuvvu
nee cimpiri juTTu
nOTlO brashhu
naligina naiTee
vaaDina puuluu

what a sight !?
SubhOdayam


నువ్వు
నీ చింపిరి జుట్టు
నోట్లో బ్రష్హు
నలిగిన నైటీ
వాడిన పూలూ

what a sight !!
శుభోదయం

చెల్లి కావాలా దాని పిల్ల కావలా ?


చెల్లి కావాలా దాని పిల్ల కావలా ?
నిన్న దేవుడు వేసిన ప్రశ్న అది !

చెమరిన చెల్లేలి చూపుల్లోంచి
లోకం చూడని పాపను చూశా
ఆరు నెలల పసిదాన్నంటూ
తెలియక నీళ్లను తన్నా నంటూ
మారం చేస్తూ గారం పోతూ
ఆటలు ఆడిన పసి కూనకు
అమ్మకు వచ్చిన కష్టం గూర్చి
వైద్యులు చెప్పిన మార్గం గూర్చి
దేవుడు పెట్టిన వేదన గూర్చి
ఆశలు వదిలిన అమ్మను గూర్చి
ఎలా చెప్పను? ఏమని చెప్పను ?

బిడ్డలు దేవుళ్ళంటుంటారే
వాళ్ళకు తెలియని విషయం వుందా ?
చంపకు మామా నన్ను నేడని
చేతులు మోడ్చిన బేబీ చూసి
అలాగె అంటు బాసను చేసి
దాని పైనే భారం వేసి
దేవుని ప్రశ్నను వాడికే ఇచ్చి
అమ్మను ఇంక నొప్పించొద్దని
మామగ దానికి నీతులు చెప్పి
కంటినీటితొ కాళ్ళను కడిగి
మాదేవుడు నీవని ప్రార్ధన చేశా !!


celli kaavaalaa daani pilla kaavalaa ?
ninna dEvuDu vESina praSna adi !

cemarina cellEli cuupullOnci
lOkam cuuDani paapanu cuuSaa
aaru nelala pasidaannamTuu
teliyaka neeLlanu tannaa nanTuu
maaram cEstuu gaaram pOtuu
aaTalu aaDina pasi kuunaku
ammaku vaccina kashTam guurci
vaidyulu ceppina maargam guurci
dEvuDu peTTina vEdana guurci
aaSalu vadilina ammanu guurci
elaa ceppanu? Emani ceppanu ?

biDDalu dEvuLLanTunTaarE
vaaLLaku teliyani vishayam vundaaa ?
campaku maamaa nannu nEDani
cEtulu mODcina bEbee cuusi
alaage anTu baasanu cEsi
daani painE bhaaram vEsi
dEvuni praSnanu vaaDikE icci
ammanu inka noppincoddani
maamaga daaniki neetulu ceppi
kanTineeTito kaaLLanu kaDigi
maadEvuDu neevani praardhana cESaa !!

Friday, August 29, 2008

కోపం




మనింట్లో నిశ్శబ్దం
నీ కోపంతో రెట్టింపైంది

నిట్టూర్పుల సంగీతం
లయ తప్పక వినిపిస్తోంది

ఆరుబయట కుండపోత
ఇంట్లో మంటను ఆర్పట్లేదు !!




maninTlO niSSabdam
nee kOpamtO reTTimpaindi

niTTuurpula sangeetam
laya tappaka vinipistOndi

aarubayaTa kunDapOta
inTlO manTanu aarpaTlEdu !!

బుంగ మూతి


నీ బుంగ మూతి ముందు లెలుసా ?
బ్రహ్మాస్త్రమూ దిగదుడుపే !!
కంటినీటికేమి చెపుదు ?
వారుణాస్త్రపు విలువ బాయె !!
నీ కస్సు బుస్సుల తీరుజెప్ప
వాయువగ్ని తూగ లేరు
ఆడవారికే ఈ యుద్ధ విద్యను
దేవుడెందుకు ఇచ్చెనబ్బా ?

ఇవ్వ కుంటే వాడి ఆవిడ
బుంగ మూతితో చంపకుందా?


nee bunga muuti mundu lelusA ?
brahmAstramU digaduDupE !!
kanTineeTikEmi cepudu ?
vaaruNaastrapu viluva baaye !!
nee kassu bussula teerujeppa
vaayuvagni tuuga lEru
aaDavaarikE ee yuddha vidyanu
dEvuDenduku iccenabbaa ?

ivva kunTE vaaDi aaviDa
bunga muutitO campakundaa?

అలక


గెలుపు నీదే ఒప్పుకున్న
ఆమిగులు నాది తీసుకున్న !!
అలక మానీ నాకీ మాట చెప్పు
నీ అలక తీర్చు మంత్రమేది
తిరిగి నవ్వునిచ్చు మందు ఏది


gelupu needE oppukunna
aamigulu naadi teesukunna !!
alaka maanee naakee maaTa ceppu
nee alaka teercu mantramEdi
tirigi navvuniccu mandu Edi

జ్ఞాపకాలు


నా జ్ఞాపకాల గనుల్లో
మన మాటల తవ్వకాలు
వచ్చిన వన్నీ నీకై తెచ్చా
మణులొచ్చినా మట్టొచ్చినా
నాకదే సర్వస్వం
మకిలని చీ కొడతావో
అర్ధమంది ఆదరిస్తావో
అంతా నీ ఇస్ఠం
నాకిక జ్ఞాపకాల గనులూ లేవు
ఇంకా తవ్వే ఆశాలేదు


naa jnaapakaala ganullO
mana maaTala tavvakaalu
vaccina vannee neekai teccaa
maNuloccinaa maTToccinaa
naakadE sarvaswam
makilani chee koDataavO
ardhamandi aadaristaavO
antaa nee isTham
naakika jnaapakaala ganuluu lEvu
inkaa tavvE aaSaalEdu

Thursday, August 28, 2008

ధన్యం నేస్తం !!


చల్లని నీళ్ళలో కాళ్ళను పెట్టి
చిన్ని పాపల గంతులు వేస్తూ
చెట్టుకు వేసిన తాళ్ళను చూసి
వుయ్యాలిది అని సంబర పడుతూ
ఆగి నిల్చిన జింకను చూసి
భయపడి పోయి నిలబడి పోతూ
వానలు లేక ఎండిన ఏరును
నీళ్ళే లేవని ప్రశ్నలు వేస్తూ
వాలు నేలపై పరుగులు తీసి
ఊపిరి చాలక రొప్పులు పెడుతూ
కిల కిల నవ్వుతు తిరిగిన నిన్ను
చూసిన కన్నులు ధన్యం నేస్తం !!


callani neeLLalO kaaLLanu peTTi
cinni paapala gantulu vEstuu
ceTTuku vEsina taaLLanu cuusi
vuyyaalidi ani sambara paDutuu
aagi nilcina jinkanu cuusi
bhayapaDi pOyi nilabaDi pOtuu
vaanalu lEka enDina Erunu
neeLLE lEvani praSnalu vEstuu
vaalu nElapai parugulu teesi
uupiri caalaka roppulu peDutuu
kila kila navvutu tirigina ninnu
cuusina kannulu dhanyam nEstam !!

నా అస్థిత్వానికి నిదర్శనమేది ?


నువ్వు నాకు తెలుసను కున్న
నిన్ను నా బింబమనుకున్న
నా మనసును తెలిసిన నీడనుకున్న
నా మనసులో మాట నీడకు చెప్ప
నీడకూ మనసు ఉందను కోలా
నొచ్చిన నీడ దూరం ఐతే
నా అస్థిత్వానికి నిదర్శనమేది ?


nuvvu naaku telusanu kunna
ninnu naa bimbamanukunna
naa manasunu telisina neeDanukunna
naa manasulO maaTa neeDaku ceppa
neeDakuu manasu undanu kOlaa
noccina neeDa duuram aitE
naa asthitwaaniki nidarSanamEdi ?

మన పెళ్ళికి ప్రేక్షకులం


విరిసిన వేసవి నింగి
గలగల పారిన సెలయేళ్ళు
అగ్నులు కక్కిన సూరీడు
అడుగులు కలిపిన అడవి నేల
అన్నీ మించి ఆత్మల కలయిక

పంచభూతాల ప్రాంగణంలో
మొదటి అడుగు గకారమవగ
పచ్చని చెట్ట్లు పందిళ్ళవగ
ఆ ప్రకృతి నడకే సప్తపదిగ

చేప్పిన మాటలు మంత్రాలవగ
ఇచ్చిన ఊతము పాణీగ్రహణం

అలల సవ్వడే మేళములవగ
పరుగిడు గుండెలు తాళములవగ
రాలే ఆకులు తలంబ్రాలుగ

అవును పంచభూతాల సాక్షిగ
మన పెళ్ళికి ప్రేక్షకులం
మూగ జింకలే దానికి సాక్షి !!!





virisina vEsavi ningi
galagala paarina selayELLu
agnulu kakkina suureeDu
aDugulu kalipina aDavi nEla
annii minci aatmala kalayika

pancabhuutaala praangaNamlO
modaTi aDugu gakaaramavaga
paccani ceTTlu pandiLLavaga
aa prakRti naDakE saptapadiga

cEppina maaTalu mantraalavaga
iccina uutamu paaNeegrahaNam

alala savvaDE mELamulavaga
parugiDu gunDelu taaLamulavaga
raalE aakulu talambraaluga

avunu pancabhuutaala saakshiga
mana peLLiki prEkshakulam
muuga jinkalE daaniki saakshi !!!

Tuesday, August 26, 2008

చెప్పవూ ?


నా కవితకు స్ఫూర్తి ఎవరు ?
నా మనసుకి స్పందన ఎవరు ?
నా చూపుకి లక్ష్యం ఎవరు ?
నా మాటకు అర్ధం ఎవరు ?
నా తలపుకు అందం ఏవరు ?
నా రాతకు జీవం ఎవరు ?

నీకు ఎన్నో ప్రశ్నలు !
ఇలా నీకు ఇంకెన్నో ప్రశ్నలు !!

నా కవితకు ఊపిరి పోసిన దానివి
నా మనసు లోతులు తెలిపిన దానివి
నా చూపులో ఆర్ధ్రత నింపిన దానివి
నా మాటకు మధువును కలిపిన దానివి
నా తలపుకు రంగులు పులిమిన దానివి
నా రాతలొ అర్ధం అద్దిన దానివి

ఈ మాటల గారడి వెనక దాగిన
మర్మం నీకు తెలియదు నేస్తం ? !!

తెలుసని చెప్ప్తే తాళే స్థోమత
నీ మనసుకి లేదని భయపడవద్దు !!
లేదని చెప్తే నాకే మౌనని
నీకా బెంగ అసలే వద్దు !!

మౌనం ప్రశ్నకి జవాబులివ్వదు
జవాబులేని ప్రశ్నలు వుండవు !!

తెలుసని చెప్తే ఆనందిస్తా
లేదని చెప్పు అర్ధం చెప్తా !!

naa kavitaku sphuurti evaru ?
naa manasuki spandana evaru ?
naa cuupuki lakshyam evaru ?
naa maaTaku ardham evaru ?
naa talapuku andam eavaru ?
naa raataku jeevam evaru ?

neeku ennO praSnalu !
ilaa neeku inkennO praSnalu !!

naa kavitaku uupiri pOsina daanivi
naa manasu lOtulu telipina daanivi
naa cuupulO aardhrata nimpina daanivi
naa maaTaku madhuvunu kalipina daanivi
naa talapuku rangulu pulimina daanivi
naa raatalo ardham addina daanivi

ee maaTala gaaraDi venaka daagina
marmam neeku teliyadu nEstam ? !!

telusani cepptE taaLE sthOmata
nee manasuki lEdani bhayapaDavaddu !!
lEdani ceptE naakE mounani
neekaa benga asalE vaddu !!

mounam praSnaki javaabulivvadu
jawaabulEni praSnalu vunDavu !!

telusani ceptE aanandistaa
lEdani ceppu ardham ceptaa !!

Monday, August 25, 2008

ఈ జన్మకు చాలు



విధి ఆడిన పావుల ఆటలొ
విడి విడిగ పయనము అయ్యాం
గుండెల నిండా కోరికలున్నా
గమ్యము మారే దారులు లేవు

ఈ జన్మకు తోడుగ బ్రతికే
రాతీనొసటన మనకిక లేదు
మరు జన్మకు తోడౌతానని
మౌనంగా మాటను ఇవ్వు

ఈ బ్రతుకుకి అంతే చాలని
చిరునవ్వుతొ చాలిస్తా !!

vidhi aaDina paavula aaTalo
viDi viDiga payanamu ayyaam
gunDela ninDaa kOrikalunnaa
gamyamu maarE daarulu lEvu

ee janmaku tODuga bratikE
raateenosaTana manakika lEdu
maru janmaku tODoutaanani
mounamgaa maaTanu ivvu

ee bratukuki antE caalani
cirunavvuto caalistaa !!

చిరు - పార్టీ

''ciru '' pati paarTee peTTaga
hayaravamuna yuutu pOlu buutulu cErun
guDDeddulu cEnureeti OTlanu guddi
dESamu glaamarukammina vaaDu dESamudurai puTTun!!

--evarinee baadha peTTE uddESam lEdu.. saradaaga raasinadi
--evarinainaa noppistE -- kshantavyuDini


''చిరు '' పతి పార్టీ పెట్టగ
హయరవమున యూతు పోలు బూతులు చేరున్‌
గుడ్డెద్దులు చేనురీతి ఓట్లను గుద్ది
దేశము గ్లామరుకమ్మిన వాడు దేశముదురై పుట్టున్‌!!

--ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదు.. సరదాగ రాసినది
--ఎవరినైనా నొప్పిస్తే -- క్షంతవ్యుడిని

ప్రేమపోరులో ఓటమి లేదు


veccani niTTuurpula abhinandala madhya
taDisina kanureppla cappaTla madhya
noccina manasE vaccina bahumati
paDina gaayaalE gelicina jnaapakaalu
prEmapOrulO OTami lEdu
virigina gunDeku viruguDuu lEdu



వెచ్చని నిట్టూర్పుల అభినందల మధ్య
తడిసిన కనురెప్ప్ల చప్పట్ల మధ్య
నొచ్చిన మనసే వచ్చిన బహుమతి
పడిన గాయాలే గెలిచిన జ్ఞాపకాలు
ప్రేమపోరులో ఓటమి లేదు
విరిగిన గుండెకు విరుగుడూ లేదు

ఒక స్నేహితుడు రాసిన దానికి సమాధానంగా
============================
"ఈ పోరాటం లో నేను ఓడిపోయి
నిన్ను చేజార్చుకున్నను
నేనే గెలిచానని కాలం నన్ను గేలిచేస్తుంటే
నిన్ను నా నుంచి కాజేయగలిగింది కాని
నీ జ్ఞ్యాపకాలని మాత్రం
చెరిపేయలేకపోయిందని గుర్తుచేసాను
మనసు చెప్పింది - నేనే గెలిచానని
నీ జ్యాపకాలైతె నా దగ్గర ఉన్నయి
కాని నువ్వు మత్రం లేవు
జీవితం చెప్పింది - నేను ఓడానని !!!" -- hi.krissh

నేనంటే అందరికీ అక్కసే !!


ningininDina taaralu naa kannulu cEsi
ninDu candruni velugu deepameTTi
velugu cuuDani neejaaDa vetuku tunTE
OrvalEni canDrudu cukka kOsamellaaDu
tolijhaamu pogamancu aDDuterupaTTindi
nEnanTE andarikee akkasE !!



నింగినిండిన తారలు నా కన్నులు చేసి
నిండు చంద్రుని వెలుగు దీపమెట్టి
వెలుగు చూడని నీజాడ వెతుకు తుంటే
ఓర్వలేని చండ్రుదు చుక్క కోసమెల్లాడు
తొలిఝాము పొగమంచు అడ్డుతెరుపట్టింది
నేనంటే అందరికీ అక్కసే !!

నిరీక్షణ


kshaNamulO vastaanani maayamaitivi
nireekshaNamu cEsi cEsi yugamulaaye
nireekshaNamani naamakaraNamu evarucEsirogaanee
nireeyugamuga maarcukunTE sababuEmO !!



క్షణములో వస్తానని మాయమైతివి
నిరీక్షణము చేసి చేసి యుగములాయె
నిరీక్షణమని నామకరణము ఎవరుచేసిరొగానీ
నిరీయుగముగ మార్చుకుంటే సబబుఏమో !!

క్షమను చూపి గుండెకద్దుకో


aligi naa kanTi neeru inkaneeku
ninDucandruni manDu muddacaiku
gunDe mukkala prOguletta vaaku
alaka, kinuka neeku sahajamainaa
alaga valisina kshaNamu neekuvastE
nE telisi cEsE manishi kaaduganaka
kshamanu cuupi gunDekaddukO !!



అలిగి నా కంటి నీరు ఇంకనీకు
నిండుచంద్రుని మండు ముద్దచైకు
గుండె ముక్కల ప్రోగులెత్త వాకు
అలక, కినుక నీకు సహజమైనా
అలగ వలిసిన క్షణము నీకువస్తే
నే తెలిసి చేసే మనిషి కాదుగనక
క్షమను చూపి గుండెకద్దుకో !!

Friday, August 22, 2008

కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?




నువ్వొస్తావని ఎంతసేపు చూశాను
కాలం చిత్తరువై అందంగా గోడెక్కింది
నిద్దుర రెప్పల్ని బలంగ లాగుతున్నా
చిన్న ముల్లు అడ్డంపడి కదలనంది
కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?
నువ్వుంటె పరుగిడుతుంది
లేనప్పుడు నడవనంటుంది !!

కాలానికి నీకు కొక్కెం ఎందుకు ?

nuvvostaavani entasEpu cuuSaanu
kaalam cittaruvai andamgaa gODekkindi
niddura reppalni balanga laagutunnaa
chinna mullu aDDampaDi kadalanandi
kaalaaniki neeku kokkem enduku ?
nuvvunTe parugiDutundi
lEnappuDu naDavananTundi !!
kaalaaniki neeku kokkem enduku ?

Thursday, August 21, 2008

నీవు నాకు తెలిసిన వ్యక్తివి కావు !




బూజు పట్టిన మనసు తంత్రులను
మరల మీటిన మనిషివి నీవు
మోడువారిన చెట్టు కొమ్మలకు
చిగురును చేర్చిన నెచ్చెలివీవు
బీడువోయిన గుండెనెర్రలకు
జీవితమిచ్చిన జవ్వని నీవు

ఎండలొ వానలొ పాలకు నీరుల
నీడగ నాతో వస్తానంటు
తోడుగ మనము వుందామంటు
చేసిన బాసలు గుర్తులు లేవ?

కాలపు వూబిలొ చిక్కి ఇప్పుడు
జారే క్షణాల బరువు పెరగగ
వుక్కిరిబిక్కిరి అయ్యె నాకు
తోడుగ వున్న నంటూ ఇప్పుడు
చెంతకు చేరి వూతము నీయక
నవ్వులు విసురుతు వినోదమందే
నీవు నాకు తెలిసిన వ్యక్తివి కావు !
నీలో మార్పుకు కారణమేంటి ?
నేను చేసిన తప్పిద మేంటి ?

bUju paTTina manasu tantrulanu
marala meeTina manishivi neevu
mODuvaarina ceTTu kommalaku
cigurunu cErcina necceliveevu
beeDuvOyina gunDenerralaku
jeevitamiccina javvani neevu

enDalO vaanalo paalaku neerula
neeDaga naatO vastaananTu
tODuga manamu vundaamanTu
cEsina baasalu gurtulu lEva?

kaalapu vuubilo cikki ippuDu
jaarE kshaNaala baruvu peragaga
vukkiribikkiri ayye naaku
tODuga vunna nanTuu ippuDu
centaku cEri vuutamu neeyaka
navvulu visurutu vinOdamandE
neevu naaku telisina vyaktivi kaavu !
neelO maarpuku kaaraNamEnTi ?
nEnu cEsina tappida mEnTi ?

Wednesday, August 20, 2008

ప్రాయశ్చిత్తం



aaTaku haddulu lEvu
aaraaTaaniki adupulu lEvu
paTTaalu tappi parugiDu manasuki
paggaalu kaTTE oDupEdi
SRtimincina cEshTalaki
kanneeTito tarpaNa
kaDupumanTato praayaSchittam !!


ఆటకు హద్దులు లేవు
ఆరాటానికి అదుపులు లేవు
పట్టాలు తప్పి పరుగిడు మనసుకి
పగ్గాలు కట్టే ఒడుపేది
శృతిమించిన చేష్టలకి
కన్నీటితొ తర్పణ
కడుపుమంటతొ ప్రాయశ్చిత్తం

Monday, August 18, 2008

గుండెలో మాట


మనసులోని మాట నీకు చెప్ప రాదు
తెలివి తెలిసి వెలికి దాన్ని తీయ లేను
గుండె మెదడుల పోరు ఇంకెంతసేపయా
విశ్వదాభిరామ వినుర వేమ !!


వేమన గారికి క్షమాపణలతో


manasulOni maaTa neeku ceppa raadu
telivi telisi veliki daanni teeya lEnu
gunDe medaDula pOru inkentasEpayaa
viSwadaabhiraama vinura vEma !!



vEmana gaariki kshamaapaNalatO

Friday, August 15, 2008

జీవిత నాటకం


vEdana vEDiki gunDelu manDaga
anudina jeevita naaTaka sthalilO
navvula rangunu mukhamuna pulimi
OTami opputu vangina naaku
cemarina kannulu cappaTlavaga
taDisina cekkili candanamavaga
aSru dhaaralE maalikalavaga
marioka dRSyamu siddhamu kaaga
terala maaTuku tappaka pOyaa!


వేదన వేడికి గుండెలు మండగ
అనుదిన జీవిత నాటక స్థలిలో
నవ్వుల రంగును ముఖమున పులిమి
ఓటమి ఒప్పుతు వంగిన నాకు
చెమరిన కన్నులు చప్పట్లవగ
తడిసిన చెక్కిలి చందనమవగ
అశ్రు ధారలే మాలికలవగ
మరిఒక దృశ్యము సిద్ధము కాగ
తెరల మాటుకు తప్పక పోయా!